గుండెపోటుతో యువకుడు మృతి: స్మశానంలో అంత్యక్రియలకు గ్రామస్తుల తీవ్ర ఇబ్బందులు

2చూసినవారు
దత్తిరాజేరు మండలం పెదకాద గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నాగిరెడ్డి వెంకట్ (30) గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు శనివారం పెదకాద గ్రామంలో నిర్వహించేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మృతదేహాన్ని దహనం చేసేందుకు పీకల వరకు నీటిలో దిగి స్మశానం వరకు తీసుకువెళ్లారు. మృతునికి భార్య ఈశ్వరమ్మ, తల్లిదండ్రులు సత్యం, బంగారమ్మ ఉన్నారు.