రోడ్డు ప్రమాదంలో పుట్టినరోజు నాడే యువకుడు మృతి

2చూసినవారు
రోడ్డు ప్రమాదంలో పుట్టినరోజు నాడే యువకుడు మృతి
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రుంకాన సాయి కిరణ్ (23) తన పుట్టినరోజునాడు విశాఖపట్నంలో దారుణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా సింహాచలం అప్పన్నస్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా, అతివేగంతో వచ్చిన ముగ్గురు యువకులు అతని ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో సాయి కిరణ్ ఎగిరిపడటంతో తల విభాగినికి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. కుమారుడి మరణవార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తు విశాఖకు బయల్దేరారు.

సంబంధిత పోస్ట్