
మెరకముడిదాం: గిరిజనులకు అమ్మ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దోమతెరలు, దుప్పట్లు పంపిణీ
మెరకముడిదాం మండలం పులిగుమ్మి గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని గిరిజనులకు అమ్మ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం దోమతెరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. సేవా సంస్థ అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ చలికాలం దృష్ట్యా గిరిజనులకు ఇవి అందజేసినట్లు తెలిపారు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం కూడా లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పులిగుమ్మి గ్రామ పెద్దలు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.







































