
మహిళా సంఘాలు సేంద్రియ శాఖలో కీలక పాత్ర పోషించాలి: వ్యవసాయ అధికారి
బొండపల్లి మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు, సేంద్రియ శాఖలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని కోరారు. సోమవారం బొండపల్లిలోని మండల మహిళా సమాఖ్య భవనంలో నూనె గింజల పంటల సాగు, వాటి ఉత్పత్తులకు విలువ జోడింపు అవకాశాలపై మహిళా రైతులకు శిక్షణ ఇచ్చారు. వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటల సాగుపై సూచనలు చేశారు.






































