
తృటిలో తప్పిన ప్రమాదం
విజయనగరం జిల్లా కోమటిపల్లి జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం కారు అదుపుతప్పి తుప్పల్లోకి దూసుకెళ్లింది. విజయనగరం నుంచి రామభద్రపురం వైపు వెళ్తున్న బొలెరో కారు, ఎదురుగా వచ్చిన స్కూటీని తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. జేసీబీ సహాయంతో కారును బయటకు తీసే ప్రక్రియ కొనసాగుతోంది.





































