గజపతినగరం - Gajapathinagaram

క్రీడలతో మానసికోల్లాసం

క్రీడలతో మానసికోల్లాసం

గురువారం బొండపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడిజిల్లా జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలను ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని తెలిపారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు శనివారం నుంచి శ్రీకాకుళంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో మూడుశాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు, 200 కిలోమీటర్లు దాటి పోటీలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత రిజర్వేషన్‌తో పాటు అలవెన్స్‌ కూడా ఇస్తామని వెల్లడించారు. ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 500 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

వీడియోలు


నిర్మల్ జిల్లా