Mar 09, 2026, 04:03 IST/నిర్మల్
నిర్మల్
డివైడర్ ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
Mar 09, 2026, 04:03 IST
నిర్మల్ జిల్లా కేంద్రంలోని బైంసా రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మంజులాపూర్ నుండి నిర్మల్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు మంజులాపూర్ కు చెందిన సృజన్ (33), నటరాజ్ నగర్ కు చెందిన కపుల్ (34) గా గుర్తించారు. వీరి మృతదేహాలను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.