Mar 05, 2026, 10:03 IST/
అబుధాబిలో డ్రోన్ల దాడులు
Mar 05, 2026, 10:03 IST
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. గురువారం ఖతార్‌లోని దోహాలో పలుచోట్ల పేలుళ్లు సంభవించాయి. అబుధాబిలో ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో ఆరుగురు గాయపడ్డారు. ఇరాన్ దాడులను ఎదుర్కొంటున్న సైప్రస్, గల్ఫ్ దేశాలకు సహాయం చేయడానికి ఇటలీ ముందుకు వచ్చింది. ఇటలీ నేవీ సిబ్బందిని సైప్రస్‌కు పంపుతుందని, గల్ఫ్ దేశాలకు యాంటీ మిసైల్, యాంటీ డ్రోన్ రక్షణ వ్యవస్థలను అందిస్తుందని తెలిపింది.