కురుపాం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు నం. 39 ప్రకారం, కురుపాం, జి. ఎం. వలస మండలాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 39 అంగన్వాడీ హెల్పర్ పోస్టులను రోస్టర్ విధానం ప్రకారం భర్తీ చేయనున్నట్లు ప్రాజెక్టు అధికారి జి. రజని దుర్గ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.