పార్వతీపురం ఎస్ వి డిగ్రీ కళాశాలలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆధునిక ఆడిటోరియం నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్, మేనేజ్‌మెంట్ సభ్యులు, అధికారులు కలిసి స్థలాన్ని పరిశీలించారు. బహుళ ప్రయోజనాలతో విద్యార్థులందరికీ సీటింగ్ సౌకర్యం ఉండేలా ఆడిటోరియం నిర్మించాలని నిర్ణయించారు. సెమినార్లు, వర్క్‌షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆధునిక వేదిక అవసరమని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.