ఎడతెరిపి లేని వానరైతుల్లో ఆందోళన

3చూసినవారు
ఎడతెరిపి లేని వానరైతుల్లో ఆందోళన
దిత్వా తుపాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజాము నుంచి కురుపాం మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ ఏడాది అధికంగా పండించిన వరి పంట కోతదశలో ఉండటంతో, తుపాను వర్షానికి ధాన్యం తడిచిముద్దవుతుందోననే భయం రైతులను పట్టుకుంది. వర్షం అధికంగా పడితే పంట నేలకొరిగి, ధాన్యం రాలిపోయి నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నూర్పిడి చేసిన ధాన్యాన్ని కళ్లాల్లో కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్