ఏనుగులను తరలించాలంటూ సీపీఎం నిరసన

8చూసినవారు
ఏనుగులను తరలించాలంటూ సీపీఎం నిరసన
మన్యం జిల్లాలో పదేళ్లుగా రైతులను ఇబ్బంది పెడుతున్న ఏనుగుల గుంపును తరలించాలని సీపీఎం పార్టీ సభ్యులు నిరసన తెలిపారు. కొమరాడలో ఆదివారం ఆ పార్టీ మండల కన్వీనర్ సాంబమూర్తి మాట్లాడుతూ, ఏళ్ల తరబడి ఏనుగుల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు కుంకి ఏనుగులను తీసుకొచ్చి  అడవి ఏనుగుల గుంపును తరలించాలని ఆయన కోరారు.