యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు పార్వతీపురంలోని సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో గురువారం భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదాలతో ప్రజల్లో చైతన్యం కల్పించారు. డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలపై వివరించారు. అక్రమ రవాణా సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు. సైబర్ నేరాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించి మహిళలతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.