కురుపాం మండలం కొండ ప్రాంతమైన తిత్తిరి పంచాయతీలో శుక్రవారం రహదారిపై గజరాజుల గుంపు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అదే క్రమంలో ఆయా గ్రామాల్లో సాగు చేసిన వరి, గంటి, సోలు, సామలు మొదలైన పంటల్లోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తున్నాయని వాపోతున్నారు. చివరకు పొలాలకు వెళ్లాలంటేనే భయమేస్తుందని ఆవేదన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామన్నామని అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.