సీతంపేట మండల పంచాయతీ రాజ్ మండల ఇంజనీరింగ్ అధికారి, నిధులు మంజూరు కాగానే గ్రామ సచివాలయ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పూతికవలన గ్రామంలో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ భవనానికి రెండు ఫ్లోర్ల స్లాబ్లు వేసి పెయింటింగ్ పూర్తయిందని, మిగతా పనులకు రూ. 15 లక్షలు నిధులు కోరుతూ నివేదిక పంపినట్లు చెప్పారు. చిన్నబుగ్గ గ్రామ సచివాలయానికి రూ. 28 లక్షలు అవసరమని, నిధులు రాగానే పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.