జియమ్మవలస: ట్రై సైకిల్‌పై దివ్యాంగుడి తిరుపతి యాత్ర

4చూసినవారు
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాంకు చెందిన నెయ్యిల ప్రసాద్ అనే దివ్యాంగుడు, ట్రై సైకిల్‌పై ఇచ్ఛాపురంలో గతేడాది డిసెంబర్ 20న తిరుపతి యాత్ర ప్రారంభించాడు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస మండలాల మీదుగా తన యాత్రను కొనసాగిస్తున్నాడు. మూడు నెలల్లో తిరుపతిలో వేంకటేశ్వర స్వామి దర్శనానికి చేరుకుంటానని ప్రసాద్ తెలిపాడు. ఆయన భక్తి భావాన్ని అందరూ కొనియాడుతున్నారు.

సంబంధిత పోస్ట్