5న మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్: పాల్గొనండి: కలెక్టర్ పిలుపు

2చూసినవారు
మన్యం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 5న జరగనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం విద్యార్థుల చదువు, ప్రగతి, లోపాలు, భవిష్యత్ మార్గదర్శకతపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించడానికి, పిల్లల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేయడానికి ఉద్దేశించబడింది. తల్లిదండ్రులు, దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తప్పకుండా పాల్గొని సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరమని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :