బొబ్బిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో శుక్రవారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో, చైర్మన్, ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీనాయన) ఆసుపత్రిని సందర్శించారు. ఎక్స్‌రే పరికరాల మరమ్మతులకు తన సొంత నిధులను కేటాయించనున్నట్లు ప్రకటించారు. 50 పడకల సీహెచ్‌సీని 100 పడకల ఏరియా హాస్పిటల్‌గా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రి సదుపాయాలు, పరికరాల కొనుగోలు, ఖాళీ పోస్టుల భర్తీపై చర్యలు తీసుకోవాలని సూచించారు.