పెట్రోల్ కొరతపై అపోహలు వద్దు… పాలకొండలో సంయుక్త తనిఖీలు

665చూసినవారు
పెట్రోల్ కొరతపై అపోహలు వద్దు… పాలకొండలో సంయుక్త తనిఖీలు
పాలకొండలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ఎస్డిపిఓ రాంబాబు, సీఐ ప్రసాద్ రావు, తహసిల్దార్ మంగళవారం సంయుక్త బృందంగా అన్ని పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. బాటిల్లు, క్యాన్లు, డ్రమ్ముల్లో ఇంధనం తీసుకెళ్లరాదని యాజమాన్యానికి హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్