పోలీసులు దాడి చేసి.. రివర్స్ కేసు పెట్టారు: బాధితుడు

787చూసినవారు
విజయనగరంలో గురువారం అర్ధరాత్రి తమపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని వ్యాన్ డ్రైవర్ ఆరోపించారు. తాము సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులమని, వాహన తనిఖీ చేయాలంటూ దాడికి పాల్పడ్డారని బాధితుడు తెలిపారు. భయంతో డ్రైవర్ '100'కు కాల్ చేయగా, పోలీసులు వచ్చి తమనే వన్ టౌన్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆయన వాపోయారు. సివిల్ డ్రెస్సులో ఉండటం వల్ల వారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులని తెలియలేదన్నారు. తమలో ఒకరిపై రివర్స్ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.