పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం ఇంటర్మీడియట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రతి జూనియర్ కళాశాలలో ప్రత్యేక రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఈ తరగతులు కొనసాగుతాయని, మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులకు కూడా ఇంప్రూవ్‌మెంట్ అవకాశం కల్పించామని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర్ రెడ్డి తెలిపారు.