
మంత్రుల పర్యటనకు భోగాపురం మోడల్ స్కూల్లో ఏర్పాట్ల పరిశీలన
కేంద్ర విద్యాశాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన నేపథ్యంలో, భోగాపురం మోడల్ స్కూల్లో ఏర్పాట్లను విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, సమగ్ర శిక్ష ఎస్‌పీడీ బి. శ్రీనివాసరావు పరిశీలించారు. సభా వేదిక, భద్రత, విద్యార్థుల ఏర్పాట్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలను తనిఖీ చేసి, పర్యటనలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు.





































