కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పరిశీలించారు. ప్రాజెక్ట్ 91.7% పూర్తయిందని, అనుకున్న దానికంటే పనులు ముందున్నాయని తెలిపారు. జూన్ 2026 నాటికి ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, రోడ్డు కనెక్టివిటీ వచ్చే మార్చి నాటికి పూర్తవుతుందని, భోగాపురం ఎయిర్‌పోర్ట్ దేశంలోనే అందమైన ఎయిర్‌పోర్ట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.