భోగాపురం: పోలిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం నలుగురు మృతి

1062చూసినవారు
భోగాపురం జాతీయ రహదారిపై శనివారం ఉదయం పోలిపల్లి వద్ద కారు బోల్తా పడిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లా వారు అని పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్ళేందుకు ప్రయాణిస్తున్న కారు పోలిపల్లి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద అదుపుతప్పి, విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్ళే రహదారి పైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీతో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో పాటు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్