మే 9న విడుదల కానున్న ‘డైరెక్టర్స్ సాబ్’ లఘు చిత్రం

1చూసినవారు
విజయనగరంలో స్థానిక కళాకారుల ప్రతిభతో రూపొందిన ‘డైరెక్టర్స్ సాబ్’ స్వతంత్ర చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ధర్మపురిలోని సిరి సహస్ర నిలయంలో జరిగిన కార్యక్రమంలో ‘చిన్న శీను సోల్జర్స్’ అధ్యక్షురాలు సిరమ్మ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించి విడుదల తేదీ ప్రకటించారు. యువత సృజనాత్మకతతో ఇటువంటి వైవిధ్యభరిత చిత్రాలు నిర్మించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ‘ఎపిక్ ప్రెసెంట్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా చిత్రం విడుదల కానుంది. కార్యక్రమంలో దర్శకుడు కోరాడ సతీష్, నటులు రాజేష్, జై నివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్