పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కలెక్టర్ ఎస్. రాంసుందరరెడ్డి తెలిపారు. డీఈవో యు. మాణిక్యంనాయుడు, సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. కేజీబీవీ పాఠశాలల్లో వంగర, రామభద్రపురం, బాడంగి, తెర్లాం వంటివి వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. మొత్తం 1,022 మంది విద్యార్థుల్లో 961 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 840 మంది ఫస్ట్ డివిజన్, 104 మంది సెకండ్ డివిజన్, 17 మంది థర్డ్ డివిజన్ సాధించారు. మెరకముడిదాం విద్యార్థిని మంత్రి విజయలక్ష్మి 590 మార్కులతో అత్యధిక ప్రతిభ కనబరిచారు. ఆదర్శ పాఠశాలలు, గిరిజన సంక్షేమ పాఠశాలలు కూడా మంచి ఫలితాలు సాధించాయి, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 94% ఉత్తీర్ణత నమోదైంది.