అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి

0చూసినవారు
అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ దాడి
భోగాపురం మండలం రాజపులోవ గ్రామంలో ఆదివారం బెల్టు షాపుపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి వద్ద నుంచి 7 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. రవికుమార్ తెలిపారు. అనధికార మద్యం దుకాణాల వద్ద కొనుగోలు చేయకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్