కామవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

1784చూసినవారు
కామవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
పూసపాటిరేగ మండలం కామవరం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలానికి చెందిన కోలా శివప్రసాద్ (35) అనే వ్యక్తి మృతి చెందాడు. విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వైపు బైక్‌పై వెళుతుండగా నిద్ర మత్తులో హైవేపై రెయిలింగ్‌ను ఢీకొనడంతో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్