గురజాడ గృహంలో చొరబాటు... విధ్వంసంపై ఆగ్రహం

11చూసినవారు
విజయనగరంలో మహాకవి గురజాడ అప్పారావు నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విధ్వంసం సృష్టించారు. బాత్రూం తలుపు, లైట్లు ధ్వంసమైనట్లు తెలిసింది. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాకవి స్మృతి స్థలానికి రక్షణ లేకపోవడం బాధాకరమని సాహితీవేత్తలు, కవులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కుటుంబ సభ్యులు విషయాన్ని గుర్తించి గురజాడ ఇందిరాతో పాటు పురావస్తు శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని సీఐ శ్రీనివాసరావు పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్