విజయనగరం పట్టణంలోని కేఎల్ పురం ఎస్సీ కాలనీకి చెందిన నడిపిల్లి రమణ (58) ఈ నెల 15న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో అదృశ్యమయ్యాడు. ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ, కుమార్తె పావని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, రమణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.