విజయనగరం రైల్వే స్టేషన్ పరిధిలో రైళ్లలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు జీఆర్పీ, రైల్వే రక్షక దళం కలిసి ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న పట్టణంలోని గుడారాల వీధికి చెందిన పి. వంశీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి గతంలో దొంగతనం చేసిన 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై బాలాజీరావు తెలిపారు.