
విమాన ప్రమాదం.. చెల్లాచెదురుగా నోట్ల కట్టలు (వీడియో)
బొలీవియా రాజధాని లా పాజ్ సమీపంలోని ఎల్ ఆల్టో నగరంలో శుక్రవారం (ఫిబ్రవరి 27) రాత్రి మిలటరీకి చెందిన హెర్క్యులస్ కార్గో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. సెంట్రల్ బ్యాంక్ నుండి కొత్త కరెన్సీ నోట్లను తరలిస్తున్న విమానం ప్రమాదానికి గురికావడంతో, రోడ్డుపై నోట్ల కట్టలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదం తర్వాత రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుండగా.. డబ్బును తీసుకునేందుకు జనం ఎగబడటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అధికారులు ఈ ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.




