నెల్లిమర్ల: అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి

71చూసినవారు
నెల్లిమర్ల: అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి
అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే లోకం నాగ మాధవి అన్నారు. నెల్లిమర్ల మండలం మద్దిపేట, ఎరుసుపేట లో ఆదివారం ఆమె పర్యటించారు. ఈ మేరకు ఆమె ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సమస్యలు, తల్లికి వందనం, పెన్షన్ మంజూరులో జాప్యం వంటి సమస్యలను అర్హులైన లబ్ధిదారులు ఆమెకు వివరించారు. సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్