నూతన సంవత్సర వేడుకలు ముందస్తు భద్రతా చర్యలతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ ఏ. ఆర్. దామోదర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కీలక కూడళ్లలో పోలీసు పికెట్లు, అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 28 మందిపై, ఎంవీ చట్టం ఉల్లంఘించిన 87 మందిపై కేసులు నమోదు చేశారు. విజయనగరం రెండో పట్టణ, గజపతినగరం స్టేషన్ల పరిధిలో డ్రోన్ల సహాయంతో 9 మంది జూదరులను అదుపులోకి తీసుకుని రూ. 1, 895 స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.