నెల్లిమర్ల మండలంలోని దన్నానపేట గ్రామంలో తాగునీరు, వీధిలైట్ల సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రత్యేకాధికారి, పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ చక్రవర్తి సూచించారు. సోమవారం గ్రామాన్ని పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన, తాగునీటి కొరత నివారణకు పది చోట్ల పబ్లిక్ కుళాయిల ఏర్పాటుకు పాయింట్లు గుర్తించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ పర్యటనలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.