నెల్లిమర్ల కౌన్సిల్‌లో వాగ్వాదంతో ఉద్రిక్తత

3చూసినవారు
నెల్లిమర్ల నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం తీవ్ర వాగ్వాదంతో వేడెక్కింది. అభివృద్ధి అంశాలపై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని వైసీపీ కౌన్సిలర్లు విమర్శించగా, టీడీపీ సభ్యులు వైసీపీ పాలనలో పక్షపాత ధోరణితో అభివృద్ధి నిలిచిపోయిందని ఆరోపించారు. చైర్‌పర్సన్ జోక్యంతో సమావేశం సర్దుకుంది.

ట్యాగ్స్ :