భోగాపురం వంతెన వద్ద విషాదం.. లారీ డ్రైవర్ మృతి

965చూసినవారు
భోగాపురం వంతెన వద్ద విషాదం.. లారీ డ్రైవర్ మృతి
విశాఖ-శ్రీకాకుళం హైవేపై భోగాపురం(మ) అక్కివరం వంతెన వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. బ్రేక్ డౌన్ అయిన వాహనాన్ని పక్కన నిలిపి, మరో లారీ డ్రైవర్ సహాయం కోరగా, సహాయం చేయడానికి వచ్చిన డ్రైవర్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్