బుధవారం భోగాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతులను శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలానికి చెందిన సాయికుమార్ (22), చిన్నమ్మడు (45), రిత్విక (4)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై సీఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మహారాజా ఆసుపత్రికి తరలించారు.