గంట్యాడ మండలంలోని పొల్లంకి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తుండగా సిరివూరి సన్యాసిరాజు అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కర్రివాని చెరువులో ఇతర కార్మికులతో కలిసి పనిచేస్తున్న సమయంలో అతను సొమ్మసిల్లి పడిపోయాడు. సహచర కార్మికులు 108 సిబ్బందికి సమాచారం అందించినా, అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.