పార్వతీపురం మన్యం జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. పాలకొండ మండలం జంపరకోట సమీపంలో లోయలో ఆటో బోల్తా పడడంతో డ్రైవర్‌తో సహా బడ్డుమసింగి గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆరుగురికి తీవ్రగాయాలు కాగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సీతంపేట మండలం పుబ్బాడ గ్రామంలో వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు. గాయాలపాలైన వారిని పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.