వీరఘట్టం మండలంలో జూనియర్ లైన్‌మెన్ (జేఎల్ఎం)గా పనిచేస్తున్న సోమేశ్వరరావు (32) గతనెల 31న విద్యుత్ స్తంభంపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని ఆసుపత్రికి తరలించగా సోమవారం అర్ధరాత్రి బ్రెయిన్ డెడ్ తో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదకర ఘటనలో కూడా మృతుడి తల్లిదండ్రులు కుమారుడి అవయవదానానికి అంగీకరించారు.