సీతంపేట ఐటీడీఏ పెట్రోల్ బంకులో రెండు రోజులుగా డీజల్, పెట్రోల్ అందుబాటులో ల
ేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం లేకపోవడంతో బంకు వద్ద 'నో స్టాక్' బోర్డులు ఏర్పాటు చేశారు. మండలంలో ఇదే ఏకైక పెట్రోల్ బంకు కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. సరఫరా లేకపోవడం వాహనదారులలో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై అధికారులు స్పందించి తక్షణం ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.