వెంకమ్మ చెరువుకు పునర్జీవం.. రైతుల్లో ఆశలు

0చూసినవారు
మన్యం జిల్లా వీరఘట్టం మండలం వి. వెంకంపేటలో దశాబ్దాలుగా పూడికతో నిండిపోయిన వెంకమ్మ చెరువుకు పునరుద్ధరణ పనులు చేపట్టడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. 81 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువుకు ‘జలధారా-జలహారతి’ కార్యక్రమంలో భాగంగా పూడిక తొలగింపు, గట్లు బలోపేతం, కాలువల మరమ్మతులు జరుగుతున్నాయి. 456 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరిగి తాగునీటి సమస్య కూడా తగ్గనుంది. పూడిక మట్టితో భూములు సారవంతమవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్