ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలు గురువారం తీవ్ర వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని APSDM హెచ్చరించింది. జిల్లాలోని 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండ తాపానికి పిల్లలు, వృద్ధులతో పాటు యువత కూడా ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీరు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇచ్చారు.