పార్వతీపురం పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్‌లోని పార్సిల్ కౌంటర్ వద్ద జరిగిన మతాబా సామాన్ల పేలుడులో తీవ్రంగా గాయపడిన బెలగాం ఆర్టీసీ కలాసి రెడ్డి రమేష్ కుటుంబానికి, బెలగాం బంగారమ్మ ఆలయం అయ్యప్ప సన్నిధానం స్వాములు అండగా నిలిచారు. ఎటువంటి ఆధారం లేని రమేష్ కుటుంబానికి స్వాములు మంగళవారం కర్షక మహర్షి ఆసుపత్రిలో రూ. 15 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని గురుస్వాములు పిలుపునిచ్చారు.