ఉద్యోగ మేళాలను వినియోగించుకొని భవిష్యత్తు నిర్మించుకోండి

10చూసినవారు
ఉద్యోగ మేళాలను వినియోగించుకొని భవిష్యత్తు నిర్మించుకోండి
పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గాయత్రి డిగ్రీ కళాశాలలో జరిగిన రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్‌ 5వ ఉద్యోగ మేళాలో పాల్గొన్నారు. నిరుద్యోగ నిర్మూలనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు అధికంగా వస్తున్నాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని నిరుద్యోగ యువతకు ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్