ఒరిస్సా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబును మంత్రి సంధ్యారాణి కలిసి సాలూరు–కొఠియా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. గవర్నర్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఈ సమస్యను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా, వారు కూడా సానుకూలంగా స్పందించారు. అరెస్టుల అంశంపై ఒరిస్సా హోంమంత్రితో మాట్లాడాలని హోంమంత్రి అనితకు సీఎం సూచించారు. గిరిజనులు భయపడవద్దని, ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని సీఎం, లోకేష్ భరోసా ఇచ్చారు.