మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ కార్యాలయంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిత్యావసరాలను పంపిణీ చేశారు. జిల్లాలో 159 కుటుంబాలకు, సాలూరు నియోజకవర్గంలోని 79 కుటుంబాలకు రూ. 3 వేల ఆర్థికసహాయంతో పాటు 25 కేజీల బియ్యం, ఒక్క కేజీ చొప్పున పంచదార, పామ్ ఆయిల్, కంది పప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు అందించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్య సేవలు, వసతులపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి ఆదేశించారు.