రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

4చూసినవారు
పార్వతీపురం మండలం చలంవలస గ్రామంలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం హామీ మేరకు రాజముద్రలతో సర్వహక్కులు కలిగిన పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పాస్ పుస్తకాల్లో కుటుంబ, భూమి వివరాలు పూర్తిగా నమోదై ఉంటాయని చెప్పారు. జగన్ పాలనలో అరాచకాలు జరిగాయని విమర్శించారు. ప్రభుత్వ విధానాలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్