మన్యం జిల్లాలో ఖరీఫ్-2026 సీజన్‌కు గాను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సీజన్‌లో సాగుకు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం చేయగా, అందులో 8,883 క్వింటాళ్లను 90 శాతం రాయితీపై రైతులకు అందజేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను ఎస్టీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజన్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారవంతతను పెంచి, రైతుల ఆదాయాన్ని పెంపుదల ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.